జెన్నీఫర్ ఇంట్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోని’. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి హ్యాట్రిక్ విజయాల తరువాత రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే అమెరికాలో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- న్యూయార్క్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, సాల్ట్‌లేక్ సిటీ లాంటి అద్భుతమైన లొకేషన్‌లలో షూటింగ్ జరుపుతున్నాం. ప్రస్తుతం లాంగ్ ఐలాండ్‌లోని జెన్నీఫర్ లోపెజ్‌కు చెందిన మాన్షన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. జెన్నీఫర్‌కు వీరాభిమానులు కావడంతో ఆమె ఇంట్లో షూటింగ్ జరగడంతో రవితేజ శ్రీనువైట్లలు ఎగ్జైట్ అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆసక్తికర కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ జరపనున్నాం అన్నారు. సంగీతం: థమన్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: విజయ్ సి.దిలీప్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్, దర్శకత్వం: శ్రీను వైట్ల.