ప్రయత్నాలు మానలేదు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో గత కొతంకాలంగా ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. ఒక్కసారిగా వెలిగిపోయిన కొందరు ముద్దుగుమ్మలు మళ్లీ కనిపించడం లేదు. అలాగే మరికొంత మంది మొదటి సినిమాతోనే స్టార్ హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేసిన ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ లిస్ట్‌లో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ ఉంది. నికిషాపటేల్ అందరికి గుర్తుండే ఉంటుంది. పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్‌లో వచ్చిన పులి సినిమాలో నికిషా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి అడుగులోనే పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో నటించడంతో ఇక ఇండస్ట్రీలోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చిందని అనుకున్నారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్‌లో విజయాన్ని అందుకోకపోవడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగని ప్రయత్నాలు మానడం లేదు. సరికొత్త ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాద్వారా ఆఫర్స్‌ను అందుకోవాలని చూస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఒక ఫొటోలో అయితే ఈమె చాలా హాట్‌గా కనిపించింది. ఆ ఫొటోను చూసి నెటిజన్స్ ఎవరి స్టైల్‌లో వారు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పులి పిల్ల ప్రయత్నాలు ఏమాత్రం తగ్గడం లేదు కదా.