పేదల కుటుంబంగా మనంసైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా మనం సైతం పనిచేస్తోందన్నారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా కార్యక్రమాలు ఫిలిం ఛాంబర్‌లో జరిగాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏడుగురు ఆపన్నులకు ఈ సందర్భంగా ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సుకుమార్, హను రాఘవపూడి, ఇంద్రగండి మోహనకృష్ణ, దిల్‌రాజు, కోటగిరి వెంకటేశ్వరరావు, మహాటీవీ మూర్తి, నవీన్ యాదవ్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ చెక్‌లను అతిథుల చేతులమీదుగా వారికి అందించారు.ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ- పేదల కుటుంబంగా ఇవాళ మనం సైతం ఎదుగుతోంది. గత మూడు నెలలో 25 మందికి సాయం అందించాం. మా దగ్గరికి వచ్చిన పేదలను ఆదుకుంటూ వాళ్లకు గుండెధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ మహాక్రతువులో భాగం అయ్యేందుకు వచ్చిన పెద్దలందరికీ రుణపడి ఉంటాను అన్నారు. దర్శకుడు హనురాఘవపూడి మాట్లాడుతూ సాయం చేయాలనుకోవడం అన్నింటికన్నా కష్టమైన పని. అది మొదలైతే కుదురుగా ఉండనివ్వదు. సాయం చేయాలనే ఆకలి ఎప్పటికీ తీరదన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ- మేము సినిమాలను కళాత్మకంగా రూపొందించాలని అనుకుంటాం. కాదంబరి కిరణ్ కళాత్మకంగా జీవిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అతిథిగా రావడమే ఒక అర్హత. అలాంటి అర్హత కలిగించినందుకు ధన్యవాదాలు అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- కాదంబరి కిరణ్ మమ్మల్ని దీవించండి అంటున్నారు. అలా అనకండి. మేము మీ వెనక నడిచేందుకు ఇక్కడికి వచ్చాం. నేను దిల్‌రాజుగా మారి 15 ఏళ్లవుతోంది. మనమంతా పుడతాం, ఎన్నో పనులు చేస్తాం, చాలా సంపాదిస్తాం, చనిపోతాం. ఆ తర్వాత మన ఫొటోపై పుట్టిన తేదీ, మరణించిన తేదీ, మధ్యలో చిన్న గీత ఉంటుంది. ఆ గీతే మన జీవితం. అది తెలుసుకునేలోపే జీవితం మన చేతిలోనుంచి వెళ్లిపోతుంది. మనం సైతం గురించి కాదంబరి నన్ను కలిసి చెప్పారు. తప్పకుండా మీ కార్యక్రమానికి సాయం చేస్తా అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- ఒకరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. మా సహాయ దర్శకుడి స్నేహితుడి భార్య అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని. ఆమె భౌతికకాయాన్ని విడుదల చేయడం లేదని తెలిసింది. అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు. కేవలం డబ్బులిస్తే సరిపోదు, అక్కడికి వెళ్లి పనులన్నీ చూడాలి. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క వ్యక్తి కాదంబరి కిరణ్. ఆయనకు అర్థరాత్రి ఫోన్ చేస్తే వెంటనే బదులిచ్చారు. నేను చూసుకుంటాను అన్నగారు అన్నారు. ఈలోగా విషయం గురించి చరణ్‌కు తెలిసింది. ఆయన ఉదయం నాకు ఫోన్ చేసి మీ సహాయ దర్శకుడి భార్య అపోలో చనిపోయిందట కదా.. నేను డబ్బు కట్టేశాను, తీసుకెళ్లమని చెప్పండి అన్నారు. అంటే, అలాంటి సమయంలో నాకు స్నేహితులు, నా చుట్టూ వున్న వాళ్లెవరూ గుర్తుకురాలేదు. కేవలం కాదంబరి మాత్రమే గుర్తొచ్చారు. మనం సైతంకు ఎలాంటి సాయం కావాలన్నా మేము భాగమవుతాం అన్నారు.