సూపర్ స్కెచ్ విజయం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టులతో మంచి ప్రయోగంగా రూపొందించిన ‘సూపర్ స్కెచ్’ ఘనవిజయం సాధించాలి. నాకు ఆప్తుడైన నర్సింగ్ ఇందులో హీరోగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు అండగా నిలుస్తుంది అని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవిచావలి దర్శకత్వంలో శ్రీ శుక్ర క్రియేషన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘సూపర్ స్కెచ్’. ఎరోస్ సినిమాస్ సమర్పణలో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ- మొత్తం తెలంగాణ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ సినిమా చేశాం. తెలంగాణ ఆర్టిస్టులతోపాటు కాలిఫోర్నియాకు చెందిన సోఫియా, ఇంగ్లాండ్‌కు చెందిన గ్యారిటోన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. డైలాగులు కిర్రెక్కించే విధంగా ఉంటాయి అన్నారు. దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ- దృశ్యం సినిమాలాగా మంచి థ్రిల్లర్ సినిమా ఇది. ఇతర భాషల్లో రీమేక్ అయ్యేంత సత్తా వుంది మా కథలో. షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందర్, శుభాంగి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:కార్తీక్ కొడకండల్, కెమెరా:సురేందర్ రెడ్డి, ఎడిటింగ్:జునైద్.