రవితేజ సరసన కీర్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు కీర్తి సురేష్‌ను ఈ సినిమాకోసం అడిగినట్లు తెలుస్తోంది. మొదటిసారి కీర్తిసురేష్ రవితేజతో నటిస్తుండడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళ్‌లో విజయం సాధించిన తెరి సినిమాకు రీమేక్‌గా రూపొందించబడుతోంది. సంతోష్ శ్రీనివాస్ గతంలో కందిరీగ, రభస, హైపర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మొదటిసారి రవితేజతో ఈ డైరెక్టర్ వర్క్ చెయ్యబోతున్నాడు. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్‌కృష్ణతో చేస్తున్న ‘నేల టికెట్’ షూటింగ్ దాదాపు పూర్తిఅయ్యింది.