క్షణం దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెడతాడు. దాని అవుట్‌పుట్ విషయంలో సంతృప్తిచెందిన తరువాతనే ఆయన రిలీజ్‌కి వెళ్లడానికి ఓకే చెబుతాడు. ముందుగా చేస్తోన్న సినిమా ముగింపుదశకి చేరుకుంటూ ఉండగా ఆయన మరో సినిమాను సెట్ చేసుకుంటాడు. అలా ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా, అల్లుఅర్జున్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్తలు బయటికి వస్తున్నాయి. దర్శకుడు రవికాంత్ పేరెపు.. అల్లు అర్జున్‌కి ఒక కథను వినిపిస్తున్నాడని అంటున్నారు. ‘క్షణం’ సినిమాను రవికాంత్ తెరపై ఎలా ఆవిష్కరించాడో.. ఎంతటి సక్సెస్‌ను అందుకున్నాడో అల్లు అర్జున్‌కి తెలుసు. అందువలన ఆయనతో కథా చర్చలు జరుపుతున్నాడని చెబుతున్నారు. రవికాంత్.. అల్లు అర్జున్‌ను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి. ఇక మరోవైపున అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.