యాత్ర మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మమ్ముట్టి ముఖ్యపాత్రలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎం.ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. వై.ఎస్ 2003లో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఈ రోజునే పాదయాత్ర మొదలుపెట్టడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలినడకతో ప్రతీ గడపలోకి వెళ్లి ప్రజల పరిస్థితులను కష్టాలను చూసి ఆవేదనతో వారి సమస్యలు తీర్చేందుకు ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు వై.ఎస్. ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న ఆయన జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాము. మా బ్యానర్‌లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. అదే కోవలో ఈ సినిమా కూడా వుంటుంది అన్నారు.