11న తులసిదళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘తులసిదళం’. కిషోర్ కంఠమనేని సమర్పణలో కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నారు. నిశ్చల్, వందనాగుప్త జంటగా నటించిన ఈ చిత్రంలో ఆర్.పి.పట్నాయక్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ, ‘హారర్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి ప్రేమ కథలోనూ ఓ సమస్య ఉంటుంది. ఈ ప్రేమకథలో హారర్ ఒక సమస్యగా ఉంటుందని ఎవరూ ఊహించని మలుపులతో సాగుతుంది. ఈ చిత్రాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో చిత్రీకరించాం. ఇందులో ఐదు పాటలుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: సునీల్ బొడ్డేపల్లి, మాటలు: తిరుమల్‌నాగ్, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: శరత్‌మండవ, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.