సమ్మర్ ప్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని-అనుపమా పరమేశ్వరన్, నాని-రుక్సార్ మీర్ జంటగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ- నా ప్రతి సినిమా విడుదలకు ముందు టెన్షన్ వుంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తే టెన్షన్ అలవాటవుతుందని అనుకుంటే, ప్రతి సినిమాకు టెన్షన్ కామన్‌గా వచ్చేస్తోంది. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌తో వున్నాం. సినిమా చాలా నచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సమ్మర్ ప్యాక్‌లా వుంటుంది అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ- మేర్లపాక గాంధి తెరకెక్కించిన రెండు చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. తన సినిమాల్లో పాత్రలు, కామెడీ, సంగీతం- ఇలా అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిస్తాడు. సినిమా అంతా ఎంజాయ్ చేసేలా వుంటుంది. మరోసారి నాని నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్ చేస్తాడు అన్నారు. దర్శకుడు గాంధి మాట్లాడుతూ- ఈ సినిమాను దిల్‌రాజు విడుదల చేస్తుండడం ఆనందంగా వుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా వుంటుంది అన్నారు.