కెరీర్ బెస్ట్ ‘మెర్క్యురీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్, స్టోన్‌బెంచ్ ఫిలింస్ సమర్పణలో కార్తికేయన్ సంతానం, జయంతిలాల్ నిర్మించిన సైలెంట్ చిత్రం ‘మెర్క్యురీ’. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నిర్మాత కార్తికేయ సంతానం మాట్లాడుతూ- యూనిక్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా వుంది. 30 ఏళ్ల ముందు కమల్‌హాసన్‌గారు ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తీశారు. ఆ తరువాత మా బ్యానర్‌లోనే మరో మూకీ చిత్రాన్ని తీస్తున్నాం. కార్తీక్ సుబ్బరాజు టేకింగ్, ప్రభుదేవా నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రం కమర్షియల్ జోనర్‌లో థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కింది. బాహుబలిలాగా ఇండియన్ సినిమాను మరో మెట్టుకు తీసుకువెళ్లే చిత్రమిది అన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ- నా కెరీర్‌లో బెస్ట్ సినిమా ఇది. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. డైరెక్టర్‌ని ఫాలో అయ్యాను. ఆడియెన్స్ ఎప్పుడు ఈ సినిమాను చూస్తారన్న ఆతృత నాలో కలుగుతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా కొత్త స్టాండర్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. కార్తీక్ కెరీర్‌లో కూడా ఇది గొప్ప సినిమా. విలన్‌గా చేయడం ఎగ్జైట్‌మెంట్ అనిపించింది అన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నాలుగో చిత్రం. ఇదొక సైలెంట్ థ్రిల్లర్ మూవీ. సినిమాలో ఏ భాషా ఉండదు. ఓ డిఫరెంట్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో విలన్ పాత్ర యూనిక్‌గా వుంటుంది. అందులో గొప్ప నటుడు చేస్తే బావుంటుందన్న ఆలోచనతో ప్రభుదేవాను సంప్రదించాను. అయనకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో విడుదల చేస్తున్నాం అన్నారు.