జోరుగా సైరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’! ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. గత 20 రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇటీవలే ప్రముఖ నటుడు అమితాబ్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ట్రెజరీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన తిరుగుబాటులో కర్నూలులోని కోయిలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఏకధాటిగా షూటింగ్ జరిపి త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.