నయనతార భయపెడుతుందట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ చిత్రం భయపెట్టినట్టుగా భవిష్యత్‌లో మరే చిత్రమూ భయపెట్టలేదేమో, దీని తర్వాత మరో హారర్ సినిమా నేను చేయకపోవచ్చ’ని అంటోంది నయనతార. మయూరి చిత్రంతో హారర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె నటిస్తున్న ఓ హారర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మానస్‌రుషి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కె.రోహిత్ నిర్మిస్తున్నారు. మురుగదాస్ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నయనతార కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని, గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని అంటున్నారు. తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, కెమెరా: దినేష్‌కృష్ణన్, ఎడిటింగ్: గోపీకృష్ణ.