17న ‘టాక్సీవాలా’ టీజర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెళ్లిచూపులు’ చిత్రంతో నటుడిగా, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో కమర్షియల్ స్టామినాగా వున్న హీరోగా పేరుతెచ్చుకొన్న విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలలు పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది. మంచి అభిరుచిగల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాత ఎస్.కె.ఎన్., రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’కి ఏ మాత్రం తీసిపోకుండా ‘టాక్సీవాలా’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్ర టీజర్‌ని ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మే 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ- అన్ని వర్గాల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా టాక్సీవాలాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలెట్స్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.