యదార్థ సంఘటనలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.సి క్రియేషన్స్ పతాకంపై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణంలో మనోహర్ చిమ్మని దర్శకత్వంలో ప్రదీప్ చంద్ర నిర్మాతగా తెలంగాణ నేపథ్యంలో నిర్మిస్తున్న తొలి తెలంగాణ చిత్రం ‘నమస్తే హైదరాబాద్’. ఈ చిత్రం లోగోను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో వరంగల్ టిఆర్‌ఎస్ ఎంపీ దయాకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్.శంకర్, రచ్చరవి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ- ఇది పొలిటికల్ సినిమా కాదు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్‌గా రూపొందుతున్న పూర్తిస్థాయి కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ తెలంగాణ సినిమా ఇది. అందరూ కొత్తవారితో నిర్మిస్తున్న చిత్రం. మే చివరివారంలో షూటింగ్ ప్రారంభిస్తాం. జూలై, ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. వరంగల్ ఎంపీ దయాకర్ మాట్లాడుతూ- మేము ఉద్యమంలో వున్న సినిమాలు అంటే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి రావటం చాలా సంతోషంగా ఉంది. నమస్తే హైదరాబాద్ అంటే మన సంప్రదాయం. ఈ సినిమా మంచి హిట్ కావాలి అని అన్నారు. ఎన్.శంకర్ మాట్లాడుతూ- మన వరంగల్ ఎంపీ దయాకర్‌గారు ఒక కళాకారుడు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకర్త. తాను ఈ వేదికకు రావడం చాలా సంతోషం. హైదరాబాద్ అంటే ఒక అద్భుతం, ఒక ఫాంటసీ, ఒక అమ్మ వొడి. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన అందరినీ వారి గమ్యానికి ఖచ్చితంగా చేరుస్తుంది. ఇలాంటి హైదరాబాద్ గురించి మన దర్శకుడు ‘నమస్తే హైదరాబాద్’ అనే టైటిల్‌తో పట్టణంలోని యువతీ యువకుల జీవితాలు ఎలా ఉంటాయి అనే కథాంశంతో దర్శకుడు మనోహర్ చిమ్మని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్ర యూనిట్ అందరికీ బెస్ట్ విషెస్ అన్నారు.