మెడికల్ థ్రిల్లర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూస్‌లీ, ఎంతవాడుగానీ చిత్రాలలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విలన్‌గా నటిస్తోన్న అరుణ్ విజయ్ ఇటీవల తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్ 23’. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ 23’ పేరుతో ప్రసాద్ ధర్మిరెడ్డి, రంధి శంకర్‌రావు, సూరాపాటి గాంధీ, ఇందర్‌కుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల హైదరాబాద్‌లో ప్రభాస్ చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ- క్రైమ్ 23 సినిమా ట్రైలర్ చాలా బావుంది. హీరోగా అరుణ్ విజయ్‌కు, ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్న నిర్మాతలకు మంచి పేరు రావాలని అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ- మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. యాక్షన్, క్రైమ్, ఫ్యామిలీ సెంటిమెంట్- ఇలా అల్ ఎమోషన్స్‌తో దర్శకుడు అరివళగన్ అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత ఇందర్‌కుమార్ మాట్లాడుతూ- ఈ చిత్రం తమిళంలో పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో కూడా అదేవిధంగా ఆడుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. మరో నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. అరుణ్ విజయ్ కాప్‌గా అద్భుతమైన నటన కనబరిచారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, భాస్కరన్ స్టైలిష్ కెమెరా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయన్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.