ఛాన్స్ కొట్టేసింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ భామ తమన్నా, మొత్తానికి మెగాస్టార్ సినిమాలో అవకాశాన్ని పట్టేసింది. మెగాస్టార్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషిస్తోందట. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా తమన్నా ఈ సినిమాలో వచ్చిన అవకాశం పట్ల స్పందిస్తూ- చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌లు నాకెంతో ఇష్టమైన నటులని, వారితో కలిసి నటించడం గొప్ప గౌరవంగా వుందని పేర్కొంది. దాంతో తమన్నా సైరాలో నటిస్తుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే, ఇందులో ఆమె పాత్ర ఏమిటనేది తెలియాల్సి వుంది. ప్రస్తుతం వరుస పరాజయాలతో కెరీర్ పరంగా వెనక్కి తగ్గిన తమన్నాకు కొత్త అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తెలుగు క్వీన్ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. తాజాగా సైరాలో అవకాశాన్ని పట్టేసింది.