100రోజుల జై సింహా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సికె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ‘జైసింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21తో ఈ చిత్రం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గురించి నిర్మాత వివరాలు తెలియజేస్తూ- బాలయ్య బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన జైసింహా చిత్రం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. కె.ఎస్.రవికుమార్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ జనాలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నుకూడా ఆకట్టుకుంది. నందమూరి అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా 100 రోజుల వేడుకను గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్‌లో ఆ రోజు సాయంత్రం నిర్వహించనున్నాం. చిత్ర బృందం అందరూ పాల్గొంటారు అన్నారు.