అన్నిచోట్లా వేధింపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్య కాస్టింగ్ కౌచ్. నటీమణులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయంపై పలువురు నటీమణులు బహిరంగంగా ఈ విషయాలపై స్పందించడంతో రచ్చ మొదలైంది. ఒక్క తెలుగులోనే కాకుండా ప్రపంచంలో అన్ని భాషల పరిశ్రమలో ఈ తరహా వేధింపులు ఉన్నాయని ఇప్పటికే చాలామంది తెలియజేశారు. తాజాగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వ్యవహారంతో మరోసారి ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే, ఈ కాస్టింగ్ కౌచ్‌పై గ్లామరు భామ ఆదా శర్మ కూడా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ- పరిశ్రమలో ఈ విషయంపై ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని, సెక్సువల్ ఫేవర్ చేయడం, చేయకపోవడం అనేది వారికి సంబంధించిన అంశమని, ఈ పనులు చేయడానికి కొంతమంది వెనుకాడటంలేదని చెబుతూనే పరిస్థితి అన్ని రంగాల్లో ఉన్నాయంటూ పేర్కొంది. అయితే తనకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది.