కుమార్‌రాజా వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్‌మి బాస్ పిక్చర్స్ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో కుమార్‌రాజా, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న కుమార్‌రాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌కందుకూరి క్లాప్‌నివ్వగా, దర్శకుడు ఎన్.శంకర్ స్విచ్చాన్ చేశాడు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శక నిర్మాత మల్లికార్జున్ మాట్లాడుతూ- లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్‌లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. అన్నిరకాల కమర్సియల్ హంగులతో తెరకెక్కే చిత్రమిది. హీరో హీరోయన్లు కొత్తవాల్లయనా పాత్రలకు తగ్గట్టుగా వారిని ఎంపిక చేశాం షూటింగ్ స్పీడుగా పూర్తిచేసి దసరాకు విడుదల చేస్తామన్నారు. నటీనటులు మాట్లాడుతూ- ఈ చిత్రంద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రంలో సత్యప్రకాష్, హేమ, హిమజ, రాజీవ్ కనకాల, రఘుబాబు, మహేష్, భరత్ తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి నిర్మాత, దర్శకత్వం: శ్రీచక్ర మల్లికార్జున