పాత్ర నచ్చితేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో హీరోయిన్‌గా పరిచయం అయిన సాయిపల్లవి ఆ తరువాత తెలుగులో ‘్ఫదా’తో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. ఆ చిత్రంతో ఆమె అందుకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. సాయిపల్లవి అంటే ఏ పాత్ర అయినా చేయగలదని నిరూపించుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘కణం’. నాగశౌర్య హీరోగా విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన కణం చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా సాయి పల్లవి చెప్పిన విశేషాలు... దర్శకుడు విజయ్ ముందు నాకు చార్లీ అనే కథ చెప్పాడు. కానీ అది కుదరకపోవడంతో మళ్లీ ఈ కథ వినిపించాడు. ఈలోగా తెలుగులో కొన్ని సినిమాలు చేశాను. అయితే తమిళం నా మాతృభాష. అందులోనూ తల్లి పాత్రలో నటించడం అనేది మామూలు విషయం కాదు. కానీ మంచి కథ కాబట్టి చేయక తప్పలేదు. హర్రర్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. చేయనని చెప్పా కానీ మా అమ్మ కథ విని బావుంటుంది చేయమని చెప్పడంతో ఆమెకోసం ఒప్పుకున్నాను. యంగ్ ఏజ్‌లో తల్లి పాత్రలు చేయడం అనేది ఓ రకంగా రిస్క్‌తో కూడుకున్నది. అయితే పాత్రకోసం ఏదైనా చేసినపుడే నటులుగా రాణిస్తాం. ఈ కథలో ఆ పాత్రకంత డిమాండ్ ఉండడంతోనే చేశాను. ఈ సినిమా తరువాత నా ఆలోచనా విధానం మారింది. ముఖ్యంగా సినిమాలో తల్లిగా నటించిన వెరోనికాతో బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా పూర్తయ్యాక తల్లిపాత్రలో ఎందుకు నటించానా అన్న అసంతృప్తి మాత్రం కలగలేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినపుడు నా మొహం నిండా మొటిమలే ఉండేవి. అసలు నన్ను హీరోయిన్‌గా ప్రేక్షకులు ఒప్పుకుంటారా అన్న అనుమానం కూడా కలిగింది. అప్పుడే ప్రేమమ్ సినిమా అవకాశం రావడం, ఆ సినిమాకు మేకప్ టెస్ట్ చేసిన తరువాత మేక్ వద్దు, నీ ఒరిజినల్ గెటప్‌లోనే కావాలని దర్శకుడు చెప్పడంతో అలాగే చేశాను. ఆ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను స్వంత మనిషిలా భావిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నాగశౌర్యతో పనిచేయడం ఆనందంగా ఉంది. తను చాలా సైలెంట్. తల్లికీ బిడ్డకూ మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో నడిచే కథ ఇది. విజయ్ అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ ముగించేసింది.