టీజర్‌లో అమ్మమ్మగారిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, బేబి షామిలి జంటగా, సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఆర్. మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టైటిల్ చూడగానే నాకు మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. వేసవి సెలవులకు అక్కడే ఎంజాయ్ చేసేవాళ్లం. అంత మంచి ఫీలింగ్ ఇచ్చిన యూనిట్‌కు థాంక్స్. ఈ సినిమాతో నాగశౌర్యకు పెద్ద పేరొస్తుంది. తప్పకుండా ఓ మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ- అమ్మమ్మగారిల్లు ఓ గుడిలాంటిది. కుటుంబంలో వ్యక్తులమధ్య మనస్పర్థలు వచ్చినా కూడా బైటికి నవ్వుతూనే కన్పిస్తాం. ఎందుకంటే, అమ్మమ్మ బాధపడకూడదని. అలాంటి వాస్తవ పాత్రలతో చిత్రీకరించిన సినిమా ఇది. నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసింది. సుందర్ రసూల్ మంచి టెక్నీషియన్లు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ- టీజర్‌ను వినాయక్ ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. మంచి సంగీతం కుదిరింది. సాయి కార్తీక్ మంచి రీరికార్డింగ్ అందించారు. తప్పకుండా ప్రేక్షకులు నచ్చే సినిమా అవుతుంది అన్నారు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ- తెలుగు ప్రేక్షకులకు నచ్చే మంచి కథ ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. త్వరలోనే విడుదల చేస్తామన్నారు.