రుణం పాటలు వచ్చేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెస్ట్‌విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్-జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రుణం’. ఈ చిత్రంతో గోపీకృష్ణ-మహేంద్ర హీరోలుగా పరిచయమవుతుండగా.. శిల్ప, తేజు, ప్రియాంక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రదీప్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఎస్.వి.మల్లిక్ తేజ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని, ఫస్ట్‌కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఎం.ఎల్.ఏ. రసమయి బాలకిషన్, తెలంగాణ ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ్, స్కైవిన్ మొబైల్స్ గాలిరెడ్డి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి మాధవ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. పాటలు చాలా బాగున్నాయని, సినిమా బాగా ఆడాలని అందరూ అభిలషించారు. జీవితంలో ప్రతిఒక్కరూ ఎంతోకొంత మందికి రుణపడుతుంటారని, దాన్ని ఆధారం చేసుకొని రూపొందించిన ‘రుణం’ తప్పక విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని నిర్మాతలు సురేష్ భీమినేని, జి.రామకృష్ణారావు పేర్కొన్నారు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు ఎస్.గుండ్రెడ్డికి సంగీత దర్శకుడు ఎస్.వి.మల్లిక్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏ.వెంకట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ఎస్.గుండ్రెడ్డి.