ఈ జర్నీ బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కంచె’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత పలు చిత్రాలతో బిజీగా మారింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ప్రగ్యా జైస్వాల్ చెప్పిన విశేషాలు..
ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. విష్ణు, జి.నాగేశ్వర్‌రెడ్డిల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూడొచ్చు. నాది ఎన్నారై పాత్ర. అందంగా, కూల్‌గా కనిపిస్తాను. నా పాత్రలో ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. ఇక కథ గురించి చెప్పాలంటే.. ఒక అకేషన్‌కోసం నేను ఇండియా వస్తాను. అక్కడ నాకు, విష్ణుకి మధ్యన లవ్‌స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమకోసం విష్ణు ఎలాంటి జర్నీ చేశా అనేదే సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంటుంది. విష్ణు, బ్రహ్మానందంగారి కాంబో నవ్వులు పూయిస్తుంది. అదే సినిమాకి పెద్ద హైలెట్. మలేషియాలో ఒక బైక్ స్టంట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు బైక్‌మీద విష్ణుతోపాటు నేను కూడ ఉన్నాను. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. అదృష్టవశాత్తు బయటపడ్డాం. ఇక మొదటిసారి ఒక ఎంటర్‌టైనర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకున్నాను. కెరీర్ పట్ల ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాను. మొదట ‘కంచె’లాంటి పీరియాడిక్ ఫిల్మ్‌చేసి ఆ తర్వాత ‘నక్షత్రం’లో యాక్షన్ స్కోప్ ఉన్న పాత్రను ఇప్పుడు ఈ సినిమాలో ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ జర్నీ బాగుంది.