ఆయనతో మళ్లీ సినిమాలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘్భరత్ అనే నేను’. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన థాంక్స్ మీట్‌లో సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ, కైరా అద్వానీ, దానయ్య డి.వి.వి., దేవిశ్రీ ప్రసాద్, బ్రహ్మాజీ, రామజోగయ్య శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ- సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నేను మహేష్ అభిమానులకు ఓ బ్లాక్‌బస్టర్ సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాను మా బ్యానర్‌లో డైరెక్ట్ చేసిన కొరటాల శివకి, నమ్మకంతో నటించిన మహేష్‌కి స్పెషల్ థాంక్స్. సినిమా చూసినవారందరూ అప్రీసియేట్ చేస్తున్నారు. వచ్చే శుక్రవారం తిరుపతిలో సక్సెస్‌ఫుల్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం అన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- మంచి ఆలోచనను రాయడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ అంత పెద్ద ఆలోచనను పెద్ద హృదయంతో తీసుకోవడం చాలా కష్టం. అనుకున్నంత సులువు కాదు. అయితే నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని అభినందించి పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. మహేష్ లాంటి హీరో ఉన్నప్పుడు ఎంతైనా రాయవచ్చు అనిపిస్తుంది. ఫైనల్‌గా ఆయన నటనను తెరపై చూసినపుడు నేను డైరెక్టర్‌ననే విషయం మర్చిపోయాను. నిజంగా ఇంత బాగా చేశారా? ఇన్ని వేరియేషన్స్ ఏంటి అనిపించింది. ఆయన ఇచ్చిన సపోర్టు మాటల్లో చెప్పలేనిది. నేను చేసిన నాలుగో సినిమా అంతకుముందు చేసిన సినిమాలన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ అయింది. దానయ్యగారు సినిమాను నమ్మి ఎంతో సపోర్టు అందించారు. నా సినిమాటోగ్రాఫర్స్ నాకంటే ఎక్కువ హోంవర్క్ చేశారు అన్నారు. మహేష్ మాట్లాడుతూ- ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు గ్రేట్‌ఫుల్ టు ఆల్. నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలయడంలేదు. బ్రహ్మాజీతో పనిచేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు విజయాన్ని సాధించాయి. ఇక కైరా అద్వానీ చక్కగా నటించింది. తెలుగు ఇండస్ట్రీకి మరో పెద్ద హీరోయిన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. శివగారికి రుణపడి ఉంటాను. శ్రీమంతుడు సినిమాకు ముందు కూడా ఇలాంటి ఫేజ్ ఉండేది. ఆయన శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. మళ్లీ నేను పడుతున్న టెన్షన్ శివకి తెలుసు. అదేమీ కనపడనీయకుండా బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు గ్రేట్‌ఫుల్ టు శివగారు. నేను ఏ సినిమాకు ఇంత కష్టపడి పనిచేయలేదు. దానయ్యతో ఎప్పటినుండో సినిమా చేయాలనుకున్నాను. ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు దానయ్యగారికి థాంక్స్. ఆయనతో మళ్లీ సినిమాలు చేస్తాను అన్నారు.