లేడీ టైగర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఎలెక్ట్ర’ చిత్రం తెలుగులో ‘లేడీ టైగర్’ పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై సి.ఆర్.రాజన్ సమర్పణలో సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మనీషా కొయిరాల ముఖ్యపాత్ర పోషించగా.. ప్రకాష్‌రాజ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బిజూ మీనన్ మరో ముఖ్యపాత్రధారి. రాజశేఖర్ రెడ్డి మాటలు, వెనిజండ్ల శ్రీరామ్మూర్తి పాటలు అందించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. నిర్మాత సురేష్ దూడల మాట్లాడుతూ- లేడీ సూపర్‌స్టార్ నయనతార, మనీషా కొయిరాల, ప్రకాష్‌రాజ్‌ల నటన ‘లేడీ టైగర్’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.