3నుండి రెండో షెడ్యూల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ పెంచేసాడు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తికావొచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్‌లో మొదటి షెడ్యూల్ రేపటితో పూర్తికానుంది. ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక రెండో షెడ్యూల్‌ని కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మొదలుపెట్టాలని ప్లాన్ చేసారు. ఈ నేపథ్యంలో మే 3నుండి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తారట. ఈ షెడ్యూల్ కూడా ఫిలిం సిటీలోనే జరగనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులు పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారట. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.