సౌత్-నార్త్ చక్కర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతూ బిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈమె తమిళంలో సూర్య, సెల్వరాఘవన్‌ల ‘ఎన్.జి.కె.’ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఇటీవలే నిర్మాతల మండలి నిరసన ముగియడంతో ఆమె ఆ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. నిన్ననే మొదటి షెడ్యూల్ ముగిసింది. దర్శకుడు సెల్వరాఘవన్ రకుల్ పెర్ఫార్మెన్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తంచేశాడు కూడ. దాంతో రకుల్ వెంటనే అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్‌దేవగన్‌తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కోసం ముంబై వెళ్లిపోయారు. ఆమె ఈరోజు నుండే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇలా ఒకేసారి తమిళ, హిందీ రెండు సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ ఇంకొన్నాళ్లపాటు ఇలాగే చెన్నై, ముంబై షెడ్యూళ్లతో బిజీగా ఉండనున్నారు.