షాహిద్ @ అర్జున్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌రెడ్డి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలెక్షన్లు విపరీతంగా రాబట్టింది. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అర్జున్‌రెడ్డి యూత్‌కు బాగానచ్చే సబ్జెక్టుకావడంతో రీమేక్ రైట్స్‌కోసం మంచి డిమాండ్ వచ్చింది. బాలీవుడ్‌లో ఈ సినిమా రీమేక్ చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అర్జున్‌కపూర్‌ను హీరోగా ఓకే చేయడానికి చాలారోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. అతడు దీనిపై తేల్చి చెప్పడం లేదు. చివరకు ఈ సబ్జెక్టు షాహిద్‌కపూర్ వద్దకు చేరింది. అతడు వెంటనే ఓకే అనేయడంతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్‌చేసిన సందీప్ వంగానే హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. మురాద్‌ఖేతాని.. అశ్విన్ వార్డే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి తమిళంలో కూడా రీమేకవుతోంది. హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ ఈ సినిమాతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌కు ముందు ధ్రువ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.