శంభో శంకర తొలిపాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్ హీరోగా శ్రీ్ధర్.ఎన్. దర్శకత్వంలో ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘శంభోశంకర’. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో తొలి లిరికల్ వీడియోసాంగ్‌ను మేడే సందర్భంగా దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన రమణారెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాలో పాటలన్నీ వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. మొదటి పాటను మేడే సందర్భంగా వి.వి.వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నాం. పాట చాలా బాగుంటుంది. అలాగే సినిమా కూడా బాగా వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీ్ధర్ ఎన్. మాట్లాడుతూ, ‘నాకిది తొలి సినిమా అయినా నిర్మాతలు సహకారంతో అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. సాయికార్తీక్ సంగీతం సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. ‘పసిడి పల్లెలోనా’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో పాటను మే 1న విడుదల చేస్తున్నాం. వినాయక్ ఆ పాటను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కొరియోగ్రాఫర్స్ భానుమాస్టర్, గణేష్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా కూడా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’అని అన్నారు. మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ కమెడియన్‌గా అన్ని చిత్రాల్లో ప్రధాన భూమికను పోషించిన శంకర్ నట విశ్వరూపం ఈ శంభోశంకర చిత్రం ద్వారా ప్రేక్షకులు చూడబోతున్నారని కచ్చితంగా చెప్పగలను. అగ్ర కథానాయకులకు ఏమాత్రం తగ్గకుండా శంకర్ నటించాడు. అతను చేసిన ఫైట్స్, డాన్సులు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. శంకర్‌కోసం మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తారు. అలాగే శంకర్ తన స్టైల్ కామెడీతో అలరించడమే కాకుండా, సెంటిమెంట్ సన్నివేశాల్లో ఆడవాళ్ళనే కాకుండా మగవాళ్ళచే కూడా కంట తడి పెట్టిస్తాడు. ఇక తొలి లిరికల్ సాంగ్‌ను వినాయక్‌గారు లాంచ్ చేయడం సినిమాకు బాగా కలిసొస్తుంది. పాట అద్భుతంగా ఉంటుంది అని అన్నారు. ఇందులో శంకర్ సరసన కారుణ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవికుమార్, సంతోష్ సాకె, మాటలు: భవానీప్రసాద్, ఛాయాగ్రహణం: రాజశేఖర్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ్ధర్ ఎన్.