మూడో గేర్‌లో డ్రైవర్ రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్‌రాముడు’ రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ని విడుదల చేసి ప్రేక్షకుల అంచనాలు రేట్టింపుచేసారు. రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సినిమా పీపుల్ పతాకంపై మాస్టర్ ప్రణవ్‌తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగుళ్ల, ఎమ్‌ఎల్‌రాజు, ఆర్‌ఎస్ కిషన్ నిర్మిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో,హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, ఒక్క పాటని,కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శంకర్‌లో మరో కొత్తకోణం ఈ చిత్రంద్వారా చూపించబోతున్నాం. శంకర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకుంటున్నాం అని తెలిపారు. తెలుగు ప్రజల దేవుడు ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ డ్రైవర్‌రాముడు టైటిల్‌ని మళ్లీ తమ సినిమాకి పెట్టుకోవడం తొలి సక్సెస్‌గా భావిస్తున్నట్లుగా తెలిపారు. శంకర్, ఇతర కమెడియన్లు చాలా బాగా చేసారు. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించారు. సినిమా చాలాబాగా వస్తుంది. అందరినీ బాగా నవ్విస్తుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మా డ్రైవర్‌రాముడు చిత్రాన్ని విడుదల చేస్తాం’అని తెలిపారు. ఈ చిత్రంలో శంకర్, అంచల్‌సింగ్, ప్రదీప్‌రావత్, నజర్, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.