టీజర్‌లో వైఫ్ ఆఫ్ రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నోవేటివ్ థాట్స్‌ను ఇంటెలిజెంట్‌గా ప్రజెంట్ చేయడం నేటి దర్శకుల స్టయల్. ఏం చెప్పినా కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలున్న కథే ‘వైఫ్ ఆఫ్ రామ్’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. టీజర్ చూసిన వెంటనే నాగ్ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. క్షణం క్షణం ఉత్కంఠను రేకెత్తించేలా ఉందన్నాడు. టీజర్ చూస్తే సినిమా ఎప్పుడు చూడాలా? అన్న ఉత్సుకత పెరిగిపోయిందని, మంచు లక్ష్మి చేసిన ఈ ప్రయత్నం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా, టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. తనకైతే ఈ ‘వైఫ్ ఆఫ్ రామ్’ టీజర్ విపరీతంగా నచ్చిందని చెప్పారు.రాజవౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. రామ్‌ను పైనుంచి తోసేసి చంపేశారు అన్న మంచు లక్ష్మి డైలాగ్‌తో మొదలై.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గురించి దర్శకుడు విజయ్ యలకంటి మాట్లడుతూ.. ఇది న్యూఏజ్ సినిమా. రెగ్యులర్ థ్రిల్లర్స్‌లా కాకుండా.. ఈ థ్రిల్లర్‌కు ఫ్యామిలీ అనుబంధాల్ని కూడా జోడించాం. వైఫ్ ఆఫ్ రామ్‌గా మంచు లక్ష్మి కెరీర్‌లోనే ఇది బెస్ట్‌గా నిలిచే పాత్ర అవుతుంది. ప్రతి క్షణం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే అంశాలు చాలా ఉంటాయి. ఊహించని ట్విస్ట్‌లతో సాగే ఈ కథ, కథనం ఖచ్చితంగా చూసే ప్రతిఒక్కరికీ సరికొత్త అనుభూతినిస్తుంది’ అన్నాడు.