పెళ్లికి సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రద్ధాకపూర్ తాజాగా సాహో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హిందీలో తెరకెక్కిన ఆషికి-2 సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ భామకు పలు క్రేజీ అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం తెలుగులో కూడా పలు అవకాశాలు వస్తున్నాయి. అయితే త్వరలోనే శ్రద్ధ పెళ్లికి సిద్ధమవుతుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధ పెళ్లిపై తండ్రి శక్తికపూర్ స్పందించాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తున్నానని, ఏ తండ్రి అయినా కూతురు మంచి వ్యక్తిని పెళ్లిచేసుకుని మంచి పొజిషన్‌లో వుండాలని కోరుకుంటాడు. అదే నా కోరిక. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజిగా వుంది. తప్పకుండా టైమ్ వచ్చినపుడు పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఈ విషయంలో ఆమె నిర్ణయంపై మాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేశాడు. మరి ఈవిషయంపై శ్రద్ధాకపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి! ఇప్పటికే బాలీవుడ్ భామలు సోనంకపూర్, దీపిక కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే.