ఉద్ధరించాలని సినిమాలు తీయరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న పేరు. రచయితగా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మిర్చితో మొదలుపెట్టి వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇప్పుడు భరత్ అనే నేను.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా విడుదలైన అన్ని కేంద్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివతో ఇంటర్వ్యూ..
* రెస్పాన్స్ ఎలా వస్తోంది?
- చాలా ఆనందంగా వుంది. భరత్ అనే నేను చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఊహించని దానికంటే కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు.
* ఈ అభినందనలు ముందే ఊహించారా?
- సినిమా విడుదలైతే తప్పకుండా ప్రేక్షకులు అభినందిస్తారని తెలుసు. కానీ ఊహించినదానికంటే భిన్నంగా రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లే ఏర్పాట్లో ఉన్నపుడు ఎందుకో ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలన్పించింది.
* మంత్రి కెటిఆర్ అభినందన ఎలా అన్పించింది?
- నిజంగా ఇది ఊహించని సంఘటన. ఒకరోజు కెటిఆర్‌గారు ఫోన్ చేసి సినిమా చూడాలి అన్నారు. ఆయన సినిమా చూశాక మంచి మెసేజ్‌ను అందించారు. ముఖ్యంగా ఇలాంటి సామాజిక అంశాల్ని డీల్ చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా అది డాక్యుమెంటరీగా మారే అవకాశం వుంది. కానీ మీరు మాత్రం పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటూ ఆయన చెప్పిన కామెంట్‌ను మర్చిపోలేకున్నాను. ఆయనతోపాటు జయప్రకాష్ నారాయణ్, ఇతర రాజకీయ నాయకులు కూడా సినిమాను చూసి అభినందించడం ఆనందంగా ఉంది.
* ఈ సినిమా కోసం ఎవరైనా రాజకీయ నాయకుల సలహాలు తీసుకున్నారా?
- సినిమాకు ముందు జయప్రకాష్ నారాయణ్‌తో పొలిటికల్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాను. సమాజంలో మార్పులు రావాలంటే ఏం చేయాలని అడిగాను. దాంతోపాటు లోకల్ గవర్నెన్స్ వంటి విషయాలపై చర్చించడం జరిగింది.
* పొలిటికల్ సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది?
- ఇలాంటి సినిమా చేయాలని చాలారోజులనుంచి వుంది. శ్రీమంతుడు సినిమాలో కేవలం గ్రామాల దత్తత గురించి అంటే, ఒక విషయాని గురించే చర్చిస్తాము. కానీ పొలిటికల్ నేపథ్యమైతే చాలా విషయాల గురించి చర్చించవచ్చు అనే ఆలోచనతో ఈ సినిమా చేశాను.
* మహేష్ కాకుంటే మరో హీరోతో చేసేవారా?
- ఖచ్చితంగా చేయను. ఇలాంటి కథను మహేష్‌లాంటి ఛార్మింగ్ వున్న హీరోతో చెబితేనే ప్రేక్షకులు మనం అనుకున్నదానికంటే ఎక్కువ పర్సెంట్ వింటారు.
ఈ కథను అనుకున్నపుడే మహేష్‌ను ఊహించా. ఆయన కాదంటే మరో కథతో వేరే సినిమా చేసేవాడిని.
* తనకు రెండు హిట్లు ఇచ్చినందుకు మీకు రుణపడి వుంటానని మహేష్ చెప్పాడు. దీని గురించి మీరేమంటారు?
- నిజంగా ఆయన అలా చెప్పడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. మహేష్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు సినిమాలు తప్ప మరో ధ్యాస లేదు. సినిమాల విషయంలో 100 శాతం న్యాయం చేసేలా ఆలోచిస్తారు.
* నిర్మాతగా మారతానన్నారు?
- తప్పకుండా నిర్మాతగా చేస్తాను. నేను చేయలేని కొన్ని భిన్నమైన కథలతో ఎవరైనా వస్తే తప్పకుండా సినిమా నిర్మిస్తా.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతానికి ఓ పక్కా కమర్షియల్ సినిమా చేయాలని ఉంది.

-- శ్రీ