వీబీ వెండితెర అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీబీ ఎంటర్‌టైనె్మంట్స సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైనె్మంట్ విష్ణుబొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఆదివారం ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. 2018కి సంబంధించిన డైరీని నిర్మాత సుఖీభవ ఫిలిమ్స్ అధినేత గురురాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గురురాజ్ మాట్లాడుతూ... విష్ణు బొప్పన చేపట్టిన ఈ కార్యక్రమం ఎప్పుడు సక్సెస్ అవుతూనే వుంది. సినిమా వాళ్లకు సంబంధించిన విలువైన సమాచారంతో ప్రతి ఏడాది ఈ డైరీని రూపొందిస్తున్నాడు. 2014నుండి టివి అవార్డులు అందిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది నుండి సినిమా అవార్డులు అందించేందుకు సిద్ధం అయింది. ఇలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులను టెక్నీషియన్స్‌ను ప్రోత్సహించినట్టు అవుతుంది. విష్ణు చేస్తున్న కార్యక్రమానికి చాలామంది స్పాన్సర్లు రావడం బట్టి చూస్తే ఆయన చేస్తున్న కార్యక్రమం ఎంత గొప్పదో తెలుస్తుంది.
తప్పకుండా ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది అన్నారు. విబి ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పటివరకు సినిమా టివి డైరెక్టరీని 2014 నుండి ప్రచురిస్తున్నాం. అలాగే2014నుండి బుల్లితెర అవార్డులు అందిస్తూ వస్తున్నాం. ఈరోజు 2018 ఫీల్ అండ్ టివి డైరెక్టరీని విడుదల చేసాం. ఈ ఏడాది నుండి వెండితెర అవార్డులను అందించాలని నిర్ణయం తీసుకున్నాం. నాకు సపోర్ట్ అందిస్తున్న స్పాన్సర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను అన్నారు.