4న డైరెక్టర్స్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినోత్సవం వేడుకలు ఈనెల 4న జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ఫిలిం చాంబర్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈనెల 4ను డైరెక్టర్స్ డేగా దర్శకుల సంఘం ప్రకటించింది. దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ ఈ వివరాలు తెలియజేస్తూ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలబడ్డ దాసరి నారాయణరావు జన్మదినోత్సవాన్ని దర్శకుల దినోత్సవంగా జరుపుకునేందుకు నిర్ణయించామని, ఈనెల 4న సాయంత్రం కల్చరల్ సెంటర్‌లో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.