రాజ మార్తాండ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా ‘రంగస్థలం’ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న రామ్‌చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రాజవంశస్థుడు అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరో కొత్త టైటిల్ క్యూలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏమిటంటే ‘రాజమార్తాండ’ అని వార్తలొస్తున్నాయి. ఈ టైటిల్‌పై మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారట. రామ్‌చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.