ష్.. సైలెన్స్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిషన్, డానియల్, సుమ హీరో హీరోయిన్లుగా రంజిత్‌కుమార్ దర్శకత్వంలో వి.రమణబాబు, డానియల్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ష్.. సైలెన్స్’. చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.రమణబాబు మాట్లాడుతూ- ఇదొక వెరైటీ కథ. ఈ కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించారు. మే ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. హీరో కిషన్ మాట్లాడుతూ- ఈ చిత్రం ద్వారా హీరోగా ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. ఈ చిత్రం ఖచ్చితంగా నాకు మంచి గుర్తింపు, పేరు ఇస్తుంది అన్నారు. కిషన్, సుమ, డానియల్, విక్కీ, బుల్లెట్ సుధాకర్, బళ్లారి బాబు, రమేష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఎ.విజయ్ కుమార్, ఆర్ట్:డేవిడ్, నిర్మాతలు:వి.రమణబాబు, డానియల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రంజిత్‌కుమార్.