డిటిఎస్‌లో అమ్మమ్మగారిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, బేబి షామిలి జంటగా స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో శ్రీమతి స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. యూ ట్యూబ్‌లో టీజర్ దూసుకుపోతోంది. నెటిజనులంతా బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డిటిఎస్ మిక్సింగ్ పనులను జరుపుకుంటోంది. అలాగే మేడే సందర్భంగా మరో పోస్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ- ‘చక్కటి కుటుంబ కథా చిత్రం కావడం.. స్వచ్ఛమైన తెలుగు టైటిల్ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పలువురు సినీ పెద్దలు కూడా టీజర్ చూసి ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.