షారుక్ సినిమాలో మాధవన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది నటుడు మాధవన్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆసక్తికరమైన సినిమాల్ని ఎంచుకుంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని రుచి చూపిస్తున్నారు. ఈమధ్యే నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ నటిస్తున్న ‘జీరో’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్, మాధవన్ మంచి సన్నిహితులు. ఆనంద్ ఎల్.రాయ్‌కు మాధవన్ ఫేవరెట్ నటుడు కూడా. అందుకే ఈ సినిమాలో మాధవన్ చేత చిన్నదే అయినా ఆసక్తికరమైన పాత్రను చేయిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్టులో సల్మాన్‌ఖాన్ ఒక పాటలో నటించగా, ఆయనతోపాటు శ్రీదేవి, రాణీముఖర్జీ, కాజోల్, కరిష్మాకపూర్, ఆలియాభట్ లాంటి స్టార్ నటీమణులు ఆ పాటలో కనిపించనున్నారు.