సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు అండ్ ఐ బ్యానర్ సమర్పణలో ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి తదితరులు ప్రధాన పాత్రధారులు. బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. రవి చావలి దర్శకుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ కార్యక్రమంలో రవి చావలి మాట్లాడుతూ- సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. హాలీవుడ్, బాలీవుడ్ ఫీలింగ్‌తో సినిమా చూసే ప్రేక్షకుడికి థ్రిల్ కలుగుతుంది. సస్పెన్స్ ఇనె్వస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రతి నిమిషం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రిప్ట్ రెడీ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడే నర్సింగ్ మక్కల క్యారెక్టర్ సూపర్బ్‌గా ఉంటుంది. తను ఈ సినిమా కోసం రెండు నెలల్లో పూర్తి ఫిట్ వచ్చాడు. నలుగురు కుర్రాళ్లు ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి చక్కటి పెర్‌ఫార్మెన్స్ చేశారు. సురేందర్ అద్భుతమైన విజువల్స్ ఇస్తే కార్తీక్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- కథ వినగానే దీనికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కుదిరితే బావుండునని అనుకున్నాం. స్క్రీన్‌ప్లే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫైనల్ ఔట్‌పుట్ చూశాం. అందరికీ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. వచ్చే నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నటుడు ఇంద్ర మాట్లాడుతూ- హీరోగా ‘పుత్రుడు’ సినిమా చేసిన నేను అటు తర్వాత దాదాపు పదిహేను చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించాను. అయితే నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ఈ ‘సూపర్ స్కెచ్’ మాత్రమే. ఇందులో ఇంటిలిజెంట్ నెగెటివ్ క్యారెక్టర్‌నిచ్చి ఆ పాత్ర బాగా రావడానికి ఎంతో సహకరించిన దర్శకుడు రవిచావలికి, నిర్మాతలకు నేనెంతో రుణపడి వుంటాను. మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకుడి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం అందరికీ నచ్చి మంచి విజయాన్ని అందుకుంటుందన్న గట్టినమ్మకం నాకుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండల్, కెమెరా: సురేంద్ర రెడ్డి.టి, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, నిర్మాతలు: బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి, దర్శకత్వం: రవి చావలి.