నికిషా..మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’ చిత్రంలో నటించిన నికిషా పటేల్ ఆ చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే కళ్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన ‘ఓం 3డి’ చిత్రంలో కూడా ఈ భామ నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో నికిషా తరువాత తమిళ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఆమె అక్కడ పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత గుర్తింపు లభించలేదు. కాగా ఈమె తాజాగా కోలీవుడ్‌లో పాండిముని చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమం కోసం చెన్నై వచ్చిన నికిషా మీడియాతో కాసేపు మాట్లాడింది. రెండేళ్ల తర్వాత తాను నటిస్తున్న తమిళ చిత్రం ఇదని, జాకీష్రాఫ్‌తో కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. అలానే అన్ని రంగాల్లోలానే సినీ రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, కాకపోతే ఈ సినిమా రంగంలో ఆ విషయం ప్రస్తుతం బహిర్గతం అవుతోందని అన్నది. విలేకరులలో మీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడుగ్గా, చాలామంది హీరోలంటే నాకు ఇష్టం, ముఖ్యంగా ప్రభుదేవా అంటే మరింత ఇష్టం అని చెప్పింది. అవకాశం వస్తే ఆయనతో నటిస్తారా అని అడగ్గా, ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన ఒప్పుకుంటే కలిసి నటించడం ఏమిటి? ఏకంగా ఆయన్ని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి అక్కడివారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నికిషా..మజాకామరి!!