చదలవాడ బ్రదర్స్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న 9వ చిత్రం ఫిలింనగర్ సాయిబాబా ఆలయంలో ప్రారంభమైంది. నాగు గవర ఈ చిత్రానికి దర్శకుడు. వసంత్ సమీర్, సెహర్ హీరో హీరోయిన్లుగా, శ్రీహర్ష, రవివర్మ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు జి.నాగేశ్వరరెడ్డి క్లాప్‌నివ్వగా, దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ- మా బ్యానర్‌లో ఇది 9వ చిత్రం. దర్శకుడు నాగు విలువైన క్రైమ్ సబ్జెక్టు చెప్పాడు. బిచ్చగాడు, డి17 తరహాలోనే విభిన్నమైన చిత్రమిది అన్నారు. దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ- వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని వినాయకరావు ద్వారా చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాను. రియలిస్టిక్‌గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. ఈనెల 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కొత్త కానె్సప్ట్‌లను, టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని చదలవాడ శ్రీనివాసరావు ఈ సినిమా చేస్తున్నారు. నాగు గవర సక్సెస్ కొడతారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెహర్, రవివర్మ, శ్రీహర్ష, శ్రావణ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. వసంత్ సమీర్ (తొలి పరిచయం), సెహర్ (తొలి పరిచయం), రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దుర్గా కిషోర్ బోయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన, దర్శకత్వం: నాగు గవర.