ప్రేమకథా చిత్రం 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్‌హిట్స్‌తో ఆర్‌పిఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమకథా చిత్రంకు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 3గా ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మాతగా ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ‘బ్యాక్ టూ ఫియర్’ అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ కొట్టారు. అమరేందర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అఖిల్‌రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హరికిషన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ- ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్‌గా మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమకథాచిత్రం హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేమకథాచిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరిషన్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల్ని ఎంటర్‌టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్‌కి మరొక సూపర్‌హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. సీనియర్ కెమెరామెన్ సి.రాంప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి, డైలాగ్స్ రైటర్ చంద్రశేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, ఎడిటర్: ఉద్ధవ్, సంగీతం: జెబి, డైలాగ్ రైటర్: చంద్రశేఖర్ ఆర్ట్: అశోక్, కో-ప్రొడ్యూసర్స్: ఆయుష్‌రెడ్డి, ఆర్‌పి అక్షిత్‌రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్‌రెడ్డి, దర్శకత్వం: హరికిషన్