రాజవౌళి ఇద్దరూ..ఇద్దరే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమాతో సంచలనం రేపిన రాజవౌళి తన తదుపరి సినిమా ఎవరితో అన్న విషయంపై ఆసక్తి ఎక్కువైంది. అయితే ఆయన తన తదుపరి చిత్రాన్ని మెగా, నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడం టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపింది. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కలిసి నటించే మల్టీస్టారర్ త్వరలోనే సెట్స్‌పైకి వచ్చేందుకు కసరత్తులు మొదలయ్యాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుందట. ఎన్టీఆర్-చరణ్‌లు బ్రదర్స్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఓ రకంగా కరణ్ అర్జున్ తరహాలో భారీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇక ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు ఏ టైటిల్ పెడతారన్న విషయంపై పలురకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా.. ఇద్దరూ.. ఇద్దరే!నట. అవును ఇద్దరి హీరోలకు సమాన వాల్యూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అందుకే ఈ టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఇందులో నిజం ఎంత అన్నది.