మనసుదోచుకుంది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ జీవితానే్న మార్చేసిన సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఆమె నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఆమె తొలి విజయం కూడా ఈ చిత్రంతోనే దక్కింది. ఈ సినిమాతో ఆలియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించిన చిత్రం ‘డియర్ జిందగీ’. జీవితం గురించి చెప్పే చిత్రమిది. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా కూడా ఆలియాభట్ మనసుదోచుకోలేకపోయింది. మరి తన నాలుగేళ్ల కెరీర్‌లో ఏ చిత్రం అంటే ఈ అమ్మడికి ఇష్టం అని అడిగితే ‘హైవే’ అని చెబుతోంది. ఈ ‘హైవే’ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొంది. ‘‘నా జీవితాన్ని మార్చేసిన చిత్రం ‘హైవే’. ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఇంతియాజ్ అలీకి కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేసింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ‘హైవే’లో వీరా పాత్రలో ఆలియాభట్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్ జంటగా ‘బ్రహ్మస్త్ర’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఇందులో కీలకం. అందుకోసం రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్‌తో పాటు చిత్ర బృందంలోని కీలక నటులు బల్గేరియాలో శిక్షణ పొందుతున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఇడో పోర్టల్ నేతృత్వంలో ఈ శిక్షణ కొనసాగుతుంది. మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్... ఇలా అన్నింటిలోనూ కొత్త తరహా మెళకువలు నేర్చుకుంటున్నారు. కరణ్‌జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ బ్యాంకాక్ వెళ్ళింది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కోసం పలువురు హీరోయిన్స్‌ని పరిశీలించిన మీదట గ్లామర్ భామ కేథరిన్‌తో ఈ ఐటెంసాంగ్ చేయించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడట. ఈమధ్య ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న కేథరిన్‌కు ఇప్పుడు మెగా వారసుడితో డాన్స్‌చేసే అవకాశం దక్కింది. ఇక కేథరిన్ సరైనోడు సినిమాతో ఎంఎల్‌ఏగా క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జయ జానకి నాయక సినిమాలోనూ నటించింది. మొత్తానికి తన సినిమాల్లో వరుసగా ఈ అమ్మడిని నటింపచేస్తున్న బోయపాటి శ్రీనుకు కేథరిన్ సెంటిమెంట్‌గా మారిందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తుంది. అందుకే ఆమెతో ఈ సినిమాలో కూడా ఐటెంసాంగ్ చేయిస్తున్నాడేమో!!