నటుడిగా ఇప్పుడే మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు లైఫ్‌టైమ్ పురస్కారాన్ని అందించి న్యూజెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ సెనేటర్‌లు సెల్యూట్ చేస్తే నన్ను భరించిన దర్శకులందరికీ ఈ సందర్భంగా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎన్.టి.రామారావు తరం నుంచి ఈతరం వరకు నాకంటూ పాత్రల్ని దర్శకులు సృష్టించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్. నటుడిగా గత నలభై ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గానూ న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ, సెనేట్ సభ్యులు ఇటీవల రాజేంద్రప్రసాద్‌కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలైక ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్‌లో రాజేంద్రప్రసాద్‌ను సత్కరించింది. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోగానే నా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ రోజులు గుర్తొచ్చాయి. ఇక నేను చనిపోయినా ఫరవాలేదు అనిపించింది. చిత్ర పరిశ్రమలో ప్రవేశించే రోజుల్లో నాకంటూ గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది పాత్రికేయ మిత్రులే. నాకు ఈ పురస్కారం ఎలా వచ్చిందా? అనే అనుమానం చాలా మందికి వుండి వుంటుంది. న్యూజెర్సీ ఎక్కువ శాతం భారతీయులు నివసించే రాష్ట్రం. అందులోనూ తెలుగువాళ్లు అధికంగా వుండే రాష్ట్రం. మన దగ్గర ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నాయకులు ఇంటింటికి వెళ్లి మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలని అడుగుతారో అలాగే న్యూజెర్సీ రాష్ట్ర సెనెటర్‌లు మీకు ఏమంటే ఇష్టమని అడిగారట. అలా అడిగినప్పుడు సినిమా అంటే ఎక్కువగా ఇష్టపడతామని, ఎప్పుడైనా ఇంటిమీద బెంగగా వుంటే రాజేంద్రప్రసాద్ చిత్రాలు చూసి ఆ బాధను మర్చిపోతుంటామని చెప్పారట. దీంతో నా గురించి వివరంగా తెలుసుకున్న వారు న్యూజెర్సీ అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించి నాకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించడమే కాకుండా గౌరవంగా సెల్యూట్ చేయడం మర్చిపోలేని అనుభూతిని కలిగించింది అన్నారు.