వెబ్ సీరీస్‌లో సన్నీ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్న్‌స్టార్‌గా సంచలనం సృష్టించి జిస్మ్-2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సన్నీలియోన్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్‌లో సంచలనం రేపిన ఈ భామకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఈమెకు అవకాశం ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపడం విశేషం. దాంతో సన్నీ క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇప్పటికీ సన్నితో సినిమాలు చేయడానికి పలు భాషల దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఒక్క హిందీలోనే కాకుండా పలు భాషల్లో నటించి ఆకట్టుకున్న సన్నీ జీవితం ఇపుడు తెరపై ఆవిష్కృతం కానుంది. సన్నీలియోన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రెండు గంటల్లో ఆమె జీవితాన్ని చెప్పడం కష్టమని భావించారో ఏమో అందుకే వెబ్ సీరీస్‌ను రూపొందిస్తారట. దాంతోపాటు కొన్ని సన్నివేశాల విషయంలో సెన్సార్ ఇబ్బందులు తలెత్తే అవకాశం వుండడంతో వెబ్ సీరీస్‌కే మొగ్గుచూపుతున్నారట. కరణ్‌జిత్‌కౌర్ ది అన్‌టోల్డ్ స్టోరీ పేరుతో తెరకెక్కే ఈ వెబ్ సీరీస్‌లో సన్నీలియోన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం రేపుతోంది. సన్నీ జీవితం, బాల్యం, పోర్న్‌స్టార్, బాలీవుడ్ ఎంట్రీలాంటి విషయాలతో ఈ వెబ్ సీరీస్ ఉండనుందట. మరి ఈ వెబ్ సీరీస్‌తో సన్నీ ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి!