ఐపిసి సెక్షన్..భార్యాబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఒక ముఖ్యమైన సెక్షన్‌ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’అన్నది స్లోగన్. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన రెట్టడి శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి), ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ ముత్యాల రాందాసు ముఖ్యఅతిథులుగా హాజరై ఫస్ట్‌లుక్ లాంచ్ చేశారు. శరశ్చంద్ర హీరోగా పరిచయవుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. నిన్నటి మేటి కథానాయకి ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కానె్సప్ట్‌బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి రూపొందించిన ‘ఐపిసి సెక్షన్... భార్యాబంధు’ మంచి విజయం సాధించాలని ముత్యాల రాందాసు, బెక్కెం వేణుగోపాల్ అభిలాషించారు. నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు’అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశమిచ్చి.. విడుదలయ్యాక అందరూ గొప్పగా మాట్లాడుకునే మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఆలూరి సాంబశివరావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు.