‘అభిమన్యుడు’ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తిచేసుకొని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జి.హరి మాట్లాడుతూ- విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. రంగస్థలం, మహానటి విజయాల తరువాత సమంతకు ఈ చిత్రం హ్యాట్రిక్‌గా నిలుస్తుంది. తమిళ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: జార్జి సి.విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్.