మల్లయోధుడుగా రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5000కి పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడుగారు. ఆయన ప్రతిభకు అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా ‘ఇండియన్ హెర్క్యులస్’, ‘కలియుగ భీమ’ బిరుదులతో కోడి రామ్మూర్తి నాయుడుగారిని సత్కరించారు. కోడి రామ్మూర్తి నాయుడుగారిని ఆ రోజుల్లో మల్లయుద్ధంలో ఓటమనేదే ఎరుగని ధీరునిగా నిలబెట్టింది. గోదాలో ఈయన ప్రదర్శించిన పరాక్రమం భారతదేశ స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తి రగిలించింది. కోడి రామ్మూర్తి నాయుడు గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుతున్నప్పటి నుండే రానా దగ్గుబాటికి ఆయనమీద విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఈ పాత్ర రానా కెరీర్‌లోనే మరిచిపోలేని పాత్రగా నిలిచిపోతుంది. అలాగే ఈ చిత్రం ఆ మహా మల్లయోధ వీరునికి ఘనమైన నివాళిగా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఎన్నో భారీ, వైవిధ్యమైన చిత్రాలతో బిజీగా వున్న రానా దగ్గుబాటి త్వరలో చేయబోయే ఈ భారీ, చారిత్రాత్మక యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. సౌత్‌కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థతోపాటు ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.